PRESS NOTE RELEASED ON AP DSC 2025 FINAL SELECTION LIST
రేపు మెగా డీఎస్సీ-2025 అభ్యర్ధుల తుది ఎంపిక జాబితా విడుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మునిసిపల్ శాఖల పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువెనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలలో ఉపాధ్యాయ ఖాళీలతో కలిపి మొత్తం (16,347) ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20.04.2025న మెగా డీఎస్సీ- 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థుల నుండి 20.04.2025 నుండి 15.05.2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 3,36,300 మంది అభ్యర్ధుల నుండి 5,77,675 దరఖాస్తులు అందాయి. అనంతరం 06.06.2025 నుండి 02.07.2025 వరకు ప్రతిరోజు రెండు పిప్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల నిర్వహణ అనంతరం 05-07-2025 తేదీన ప్రాథమిక కీలని విడుదలచేయడం జరిగింది. వాటిపై 12-07-2025 వరకు అభ్యర్ధుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది, వాటిని నిపుణుల బృందంతో విశ్లేషించి
01-08-2025 తేదీన తుదికిలని విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ పరమైన అభ్యంతరాలను / మార్కులను సరిచేసుకోవడానికి 17-08- 2025 నుండి 21-8-2025 వరకు అభ్యర్ధులకు అవకాశం కల్పించడం జరిగింది.
పరీక్షల సంఖ్య, అభ్యర్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఒకటి కన్నా ఎక్కువ స్క్రిప్టులలో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్ధులకు సమన్యాయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగినది.
అభ్యర్ధుల టెట్ స్కోరు (20%) మరియు డీఎస్సీ స్కోరు (80%) లకు వెయిటేజ్ ఇచ్చి, అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీ పోస్టుల మెరిట్ జాబితాలు రూపొందించడం జరిగినది.
అనంతరం, జిల్లా వారీగా 50 మంది అభ్యర్ధులకు ఒక బృందం చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి, 28.08.2025 నుండి 13.09.2015 వరకు 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధ్రువపత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు.
బ్లెండ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థో, ఎం. ఆర్ విభాగాలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలనలో వైద్యశాఖ అధికారుల సహకారం తీసుకోవడం జరిగింది.
ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్ధుల ధృవపత్రాలను సవివరంగా పరిశీలించి, మేనేజ్మెంట్ వారీగా, పోస్టు వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగినది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15, 2025న విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు మరియు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
- ఎమ్ వెంకట కృష్ణారెడ్డి
కన్వీనర్ ఏపీ మెగా డీఎస్సీ 2025
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍