AP LIMITED DSC RECRUITMENT 2022 NOTIFICATION, SYLLABUS
వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 21న ఒక ప్రకటనలో వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు
*డీఎస్సీ నోటిఫికేషన్*
*502 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్*
*అక్టోబర్ 23న పరీక్షలు*
*నవంబర్ 9న తుది ఫలితాలు*
*అమరావతి, ఆంధ్రప్రభ*: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ -2022ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 199, మోడల్ స్కూల్స్లో 207, మున్సిపల్ పాఠశాలల్లో 15, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 81.. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయ -నున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీలో టెట్ మార్కుల కు 20 శాతం వెయిటేజీ కల్పించారు. ఆన్లైన్ లో ఫీజు చెల్లించేందుకు ఈనెల 23 బుధవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 18 లోపు దరఖాస్తులను ఆన్లైన్ లోనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అక్టోబరు 6 నుంచి హాల్ టికెట్లను సీఎస్ఈ. ఏపీ.జీ.వోవీ.ఇన్ అనే వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 23న పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 4న డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఫలితాలు వెల్లడించనున్నారు. తుది ఫలితాలు వెల్లడించనున్న నవంబరు 4కు ముందు అక్టోబరు 28న పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి అక్టోబరు 31 వరకు విడుదల చేసిన కీపై అభ్యంతరాలను కూడా స్వీకరించనున్నారు. ఆ తరువాత నవంబరు 2న ఫైనల్ కీ విడుదల చేసి నవంబరు 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్ పీజీటీ, టీజీటీ, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకించి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న 81 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 7, విశాఖపట్టణంలో 6, తూర్పుగోదావరిలో 6. పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో 7. గుంటూరు, ప్రకాశంలో 6, నెల్లూరులో 9. కడపలో 7. చిత్తూరులో 5, అనంతపురంలో 10, కర్నూలులో 2 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP LIMITED DSC2022 RECRUITMENT
AP LIMITED DSC RECRUITMENT SCHEDULE - 2022
1 | Date of Issuing of Limited Recruitment Notification & Publishing of Information Bulletin. | 22.08.2022 |
2 | Payment of Fees through Payment Gateway | 24.08.2022 to 17.09.2022 |
3 | Online submission of application through http://cse.ap.gov.in | 25.08.2022 to 18.09.2022 |
4 | Help desk services during working hours | 22.08.2022 onwards |
5 | Online Mock Test availability | 17.10.2022 onwards |
7 | Download Hall Tickets | 06.10.20222. |
8 | Schedule of Examination | Examination Dates |
Secondary Grade Teacher | 23.10.2022 onwards Two Sessions per day Subject wise prescribed examination hours are available in information bulletin and G.Os. and in syllabus copy. |
School Assistant Languages |
School Assistant (Non- Languages) |
School Assistant Special Education |
TGT (Languages) |
TGT (Non-Languages) |
TGT (English Language Proficiency Test) |
PGT (Languages) |
PGT (Non-Languages) |
PGT (English Language Proficiency Test) |
Music |
| Art |
9 | Release of Initial Key | 28.10.2022 |
10 | Receiving of Objections on initial key | 28.10.2022 to 31.10.2022 |
11 | Final key published | 02.11.2022 |
12 | Final result declaration | 04.11.2022 |
Important Links
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍