ఉదయం, సాయంత్రం తరగతులు ఐచ్ఛికమే - ఉన్నత పాఠశాలల సమయపాలనపై స్పష్టత
ఈనాడు, అమరావతి:
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సమయపాలనపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది . ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గం టల వరకు అందరూ తరగతులు నిర్వహించాలని సూచించింది. ఉదయం 8 గంటల నుంచి 8.45గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కార్యకలాపాలు ఐచ్ఛికమేనని వెల్లడించింది. పాఠశాలల సమయంపై స్పష్టతనివ్వాలని ఉపాధ్యాయుల నుంచి వినతులు రావడంతో ప్రత్యేకంగా మెమో జారీ చేసింది. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలతో ఆటలు ఆడించాల్సి ఉంటుంది. ఇందు కోసం వీరికి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు హాజరు మినహాయింపునిచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాతనే వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతారు. ఒకవేళ ఉదయం 8గంటల నుంచి 8.45 గంటల వరకు స్వచ్ఛందంగా తరగతులు నిర్వహించాలనుకునే ఉపాధ్యాయులు పిల్లలతో చది వించడం, పోటీ పరీక్షలకు సన్నద్ధత, పునశ్చరణ తరగతులు నిర్వహించాలని పేర్కొంది.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍