Type Here to Get Search Results !

AP KGBV Admissions 2022-23: Notification Released for Intermediate Admissions


 


AP KGBV Admissions 2022-23: Notification Released for Intermediate Admissions

కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్ ప్రవేశము కొరకు నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత విద్యా సంవత్సరం వరకు రాష్ట్రంలోని 221 కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్మీడియెట్ విద్య అందించగాఈ విద్యా సంవత్సరం నుంచి మిగిలిన 131 కేజీబీవీల్లో కూడా ఇంటర్మీడియట్ విద్య అప్ గ్రేడ్ చేశామన్నారు.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలుపేద బీసీఎస్సీఎస్టీమైనారిటీబీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామన్నారు. ఆసక్తి గల బాలికలు 27వ తేదీ నుంచి జూలై 12 వరకు దరఖాస్తులు పొందాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని వివరించారు. సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగానూ చూడవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 94943 83617, 94907 82111 నంబ ర్లను సంప్రదించాలని వెట్రిసెల్వి కోరారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 27-06-2022

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ: 29-06-2022   

 దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ: 12-07-2022   

NOTIFICATION & SCHEDULE

WEBSITE

Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...