Type Here to Get Search Results !

రేపటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలు


*🌼రేపటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలు*

*👉ఈ నెల 28  నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకు పాఠశాలల్లో సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నారు*

👉28 న గ్రామ పంచాయతీ ,  సచివాలయాల సహకారంతో తరగతి గదులు , ఫర్నిచర్ను శుభ్రం చేస్తారు . 

👉29 న తాగునీటి ట్యాంకుల శుభ్రత ,నీటి పరీక్షల నిర్వహణ . రికార్డు షీట్లు , బదిలీ ధ్రువపత్రాల జారీ , విద్యా అనుబంధ శాఖల ఉద్యోగులు , తల్లిదండ్రుల కమిటీ లతో సమావేశాలు నిర్వహిస్తారు . 

👉30 న బడి బయట పిల్లల గుర్తింపు , నూతన ప్రవేశాలు కల్పించాలి .

 👉జులై 1 న అన్ని ప్రయోగశాలలు క్రియాత్మకంగా ఉండేలా చూడాలి . విద్యార్థుల ఆటలకు క్రీడా సామగ్రిని సిద్దం చేయాలి . 

👉2 న పాఠశాలల భద్రతపై దృష్టి సారించి శిథిల భవనాల నుంచి వేరేచోటకు బడిని తరలించేందుకు చర్యలు చేపట్టాలి . ప్రథమ చికిత్స కిట్లు సమకూర్చుకోవాలి .
 5 న జగనన్న విద్యా కానుక అందరికీ అందించేలా సిద్ధం చేయాలి . 

👉3 న అప్పటివరకు పూర్తికాని పనులపై దృష్టి సారించాలి . 

👉4 న జగనన్న గోరుముద్ద అందించేలా , పరిశుభ్ర వాతావరణంలో రుచికర భోజనం అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలి . 

👉5 న పండుగ వాతా వరణంలో కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలకాలి. పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించాలి . జేవీకే కిట్ల పంపిణీ చేయాలి . తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , తల్లిదం డ్రులు , ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించి ఘనంగా పాఠశాలల్ని ప్రారంభించాలి . 

👉అన్ని మండలాల్లో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు ప్రణాళికాయుతంగా జరపాలి
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...