🔳సచివాలయ క్రమబద్ధీకరణ ఫైల్‌పై సీఎం సంతకం!
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు సీఎం శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అర్హులైన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను జూలై 1 నుంచి క్రమబద్ధీక రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కలెక్టర్లు ప్రొబేషన్ ప్రకటిస్తూ ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించిన ఫైల్‌ను ఆయా జిల్లా కలెక్టర్లు గ్రామ, వార్డ్ సచివాలయ శాఖకు పంపారు. ఆ శాఖ నుంచి పంపిన ఫైల్ సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. శుక్రవారం సీఎం ఆ ఫైల్‌పై సంతకం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍