Type Here to Get Search Results !

CM Live Streaming Program on YouTube Channel Jagananna Amma Vodi Addressing the Public today 11 AM

CM Live Streaming Program on YouTube Channel Jagananna Amma Vodi Addressing the Public today 11 AM అమ్మ ఒడి శ్రీకాకుళంలో నేడు సీఎం జగన్ చేతుల మీదుగా జమ తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లు ఈసారి 43.96 లక్షల మందికి లబ్ది వరుసగా మూడో ఏడాది పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా

రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి నిధులు సోమవారం విడుదల కానున్నాయి శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులు జమ చేయనున్నారు.

రెండేళ్లపాటు జనవరిలో అమ్మఒడి విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 27న ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.

CM Live Streaming Program on YouTube Channel Jagananna Amma Vodi Addressing the Public today 11 AM

అమ్మఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించి, కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు జమ చేస్తారు. మధ్యాహ్నం: 12.15 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై, 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

82 లక్షల మందికి లబ్ధి

రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82 లక్షల 31 వేల 502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ.. 43 లక్షల 96 వేల 402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమ చేయనున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని అమ్మఒడి కింద అందిస్తున్నారు. ఈ ఏడాది అందిస్తున్న రూ. 6,595 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం జగనన్న అమ్మ ఒడి పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం దాదాపు రూ. 19,618 కోట్లుగా ఉంది. 2019-20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది లబ్దిదారులకు రూ.6,349.53 కోట్లు, 2020-21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది లబ్ధిదారులకు రూ. 6, 673 కోట్లు, 2021 – 22 విద్యా సంవ త్సరంలో 43,96,402 మంది లబ్ధిదారులకు చేస్తున్న ఆర్థిక సాయం రూ. 6,595 కోట్లుగా ఉంది.

పథకం మొదలుపెట్టిన తర్వాత 2019 – 20లో, కోవిడ్ కారణంగా 2020 – 21 సంవత్సరాల్లో కనీసం 75 శాతం హాజరు నిబంధనకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకానికి కనీసం 75 శాతం అటె ండెన్స్ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడే ఆ జీవోలోనే నిబంధనలు ఉన్నాయి.

అమ్మఒడితోపాటు ప్రభుత్వం మనబడి నాడు – నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన- సీబీఎస్ఈతో, బైజూస్ ఒప్పందంతో నాణ్యమైన విద్య వంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల సమీక్షలో పేర్కొన్నారు.

స్కూల్స్ కోసం వెయ్యి మినహాయింపు

మనబడి నాడు – నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్థులకు అందాలన్న తపనతో, ఏమైనా చిన్న రిపేర్లు సమయానికి వెంటనే పట్టించుకోక పోతే మరింత పెద్ద కల్పించిన మంచి సౌకర్యాలు పనికిరాకుండా పోతాయని, ఆ పరిస్థితి రాకుండా అప్పటికప్పుడే సరిచేయాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి నిధుల నుండి నాడు- నేడులో అభివృద్ధి చెందిన స్కూళ్ళ బాగు కోసం స్కూల్ మెయింటె నెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)కు రూ. వెయ్యి చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. అలాగే స్కూళ్ళలో మంచి టాయిలెట్లు లేక ఆడపిల్లలు బడులు మానేసే దుస్థితి మారేలా.

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ నాడు – నేడు ద్వారా నిర్మించిన బాలికల ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్ కొరకు, డ్రాపౌట్స్ను తగ్గించడంతోపాటు విద్యార్ధుల ఆత్మగౌరవం నిలబెట్టాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం నిధుల నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీ ఎంఎఫ్)కు రూ. వెయ్యి జమ చేస్తోంది. నిర్వహణలో ఏవైనా లోపాలుంటే హక్కుగా అడిగే పరిస్థితులను తల్లులకు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయిం టెనెన్స్ ఫండ్ ల నిర్వహణ బాధ్యత కూడా హెడ్మాస్టర్లు, పేరెంట్స్ కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది.

More Information about School Education Jagananna Ammavodi Programme Click here

Dear Sir/Madam,

Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jagan Mohan Reddy will be Depositing Annual Financial Assistance into the Accounts of Mothers of Children studying from classes 1 to Intermediate, under “Jagananna Amma Vodi” and Addressing the Public at Kodi Rammurthy Stadium Srikakulam on 27-06-2022 Monday at 10:55 AM

Live Streaming on YouTube Channel at:

https://youtu.be/_NwYwDY4aAs

Tags
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...