శుక్రవారం అంటే జూన్ 24న ఎన్‌సీసీ మహిళా అధికారుల కాన్వొకేషన్ వేడుకలో గుర్బీర్‌పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, త్రివిధ సాయుధ దళాలలో సైనికులను నియమించే ఈ కొత్త పథకం గురించి క్యాడెట్‌లకు ఎన్‌సీసీ అధికారులు వివరిస్తారని చెప్పారు. తద్వారా ఈ పథకం ద్వారా యువకులు పెద్ద సంఖ్యలో ఆర్మీ సేవల్లో చేరతారని అన్నారు. ఎన్‌సీసీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మహిళా ఎన్‌సీసీ అధికారులు గుర్బీర్‌పాల్‌కి సెల్యూట్ చేసి గౌరవం చాటారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 112 మంది మహిళలు ఈ అకాడమీలో మూడు నెలల శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడు వీరంతా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఎన్‌సీసీ ఆఫీసర్లుగా వెళ్తున్నారు.
యువకులను ఆదర్శ పౌరులుగా మార్చే ముఖ్యమైన బాధ్యత ఈ ఎన్‌సీసీ మహిళా అధికారులపై ఉందని, వారు ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందని ఎన్‌సీసీ డైరెక్టర్ పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన గుర్బీర్‌పాల్ 1950 నుంచి ఎన్‌సీసీలో ఉమెన్ క్యాడెట్‌లు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. ఇలాంటి క్రమశిక్షణ దేశభక్తి ఉన్నవారిని సైన్యంలోకి రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అగ్నిపథ్ ప్రారంభించిందన్నారు. క్యాడెట్‌లకు ఎన్‌సీసీ అధికారులు దీనిపై మరింత సమాచారాన్ని వివరిస్తారని అన్నారు. అంతేకాదు, ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్లు పొందిన క్యాడెట్లకు అగ్నిపథ్‌లో బోనస్ పాయింట్లు/మార్క్స్ లభిస్తాయని తెలిపారు.
భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎన్‌సీసీలో జాయిన్ అయ్యారని గుర్బీర్‌పాల్ సింగ్ చెప్పారు. ఈ యువకులు అగ్నివీరులుగా మారడం ద్వారా సైన్యంలో సేవ చేయవచ్చని.. నాలుగేళ్ల సేవను పూర్తి చేశాక అందరికీ ఆదర్శ పౌరులుగా మారతారని చెప్పుకొచ్చారు. స్కూల్స్, కాలేజీల్లో ఎన్‌సీసీని తప్పనిసరి చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా కార్ప్స్‌లో ఇంప్రూవ్‌మెంట్స్, కంపల్సరి ట్రైనింగ్ సంబంధించిన అంశాలపై పరిశీలన చేసేందుకు ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్యానెల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍