ప్రాక్టీస్ క్లాస్ ఎక్కడ చేయాలో తెలుసుకుందాం:
1.ఒక మండలం నుంచి ఇద్దరు టీచర్ లు. ఇద్దరు CRP లు వచ్చినట్లయితే, అందులో ఒక టీచర్ మరియు ఒక CRP కలిసి టీచర్ పనిచేస్తున్న
స్కూల్ లోనే రోజులో ఉదయం / మధ్యాహ్నం గాని రెండు గంటలసేపు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వుంటుంది. అంటే ఆ మండలంలో రెండు చోట్ల ప్రాక్టీస్ క్లాస్ జరుగుతుంది. ఒకవేల సిఆర్పి cluster మరియు teacher cluster వేరు వేరుగా ఉన్న చోట CRP మరొక కొత్త తన cluster school teacher కి TaRI. orientation ఇచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఒక మండలం నుండి maximum 3 ప్రాక్టీస్ class
మాత్రమే నిర్వహించవలసి ఉంటుంది.
2. ఒక మండలం నుంచి ముగ్గురు టీచర్ లు, ఒక CRP వచ్చినట్లయితే, ఒక టీచర్ మరియు ఒక CRP కలిసి టీచర్ పనిచేస్తున్న స్కూల్ లోనే
రోజులో ఉదయం /మధ్యాహ్నం గాని రెండు గంటలసేపు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వుంటుంది. మిగిలిన ఇద్దరు టీచర్ లు సింగిల్ గా వాళ్ళ
పనిచేస్తున్న స్కూల్ లోనే ప్రాక్టీస్ క్లాస్ రోజులో ఉదయం/మధ్యాహ్నం గాని రెండు గంటలసేపు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వుంటుంది. అటువంటి
ఈ మండలలో మూడు చోట్ల ప్రాక్టీస్ క్లాస్ జరుగుతుంది.
కొన్ని ముఖ్య సూచనలు...
Note:- టీచర్ మరియు CRP లు ఇద్దరు కలిసి పనిచేస్తున్న స్కూల్ లో ప్రాక్టీస్ క్లాస్ కోసం టీచర్ ఎంచుకున్న పిల్లలతోనే CRP మరియు
టీచర్ కలిసి ఒకే టైమ్ లో వివిధ గ్రూప్ లతో ప్రాక్టీస్ క్లాస్ జరిపించాల్సి వుంటుంది.
ప్రాక్టీస్ క్లాస్ కోసం పిల్లలను ఎంచుకోవడం ఎలా
1. మీ ప్రాక్టీస్ క్లాస్ కోసం తరగతులు 3.4.5 పిల్లల్ని ఎంచుకోవల్సి వుంటుంది. రోజు 2 గంటలు పిల్లలతో District Level ట్రైనింగ్ లో
తెలుసుకున్న కృత్యాలు ప్రాక్టిస్ చెయ్యాలి.
2. మీ స్కూల్ లో 3,4,5 తరగతుల పిల్లలు మొత్తం కలిపి 30 నుంచి 35 మంది వున్నట్లయితే, పిల్లలందరిన పరీక్షించి స్థాయిల ఆధారంగా
గ్రూపులుగా చేసి ప్రాక్టీస్ చేయాల్సి వుంటుంది.
3.మీ స్కూల్ లో 3,4,5 తరగతుల పిల్లలు మొత్తం కలిపి పై ఎన్రోల్మెంట్ వున్నట్లయితే, 3వ తరగతి నుంచి 10 మంది, 4వ తరగతి నుంచి 10
మంది మరియు 5వ తరగతి నుంచి 10 మంది. మొత్తం 30 మందికి తగ్గకుండా అన్ని స్థాయి పిల్లలు వుండే విధంగా పిల్లలందరిని పరీక్షించి స్థాయిల
ఆధారంగా గ్రూపులుగా చేసి ప్రాక్టీస్ చేయాల్సి వుంటుంది.
4. మీ స్కూళ్ళో తక్కువ ఎన్రోల్మెంట్ వుంటే మీ మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించి, మీకు దగ్గరలో వున్న సరిపడా enrolment వున్న
స్కూల్లో ప్రాక్టీస్ చేయవలసి వుంటుంది.
మీ మండలంలో రెండు స్కూల్లో ప్రాక్టీస్ జరుగుతుంటే ఒక స్కూల్లో ఉదయం మరియు ఇంకొక స్కూళ్లు మధ్యాహ్న సమయంలో జరగాలి.
ఒకవేళ మీ మండలంలో మూడు స్కూళ్లు ప్రాక్టీస్ జరుగుతుంటే, రెండు స్కూళ్లు ఉదయం మరియు ఒక స్కూల్ మధ్యాహ్న సమయంలో
జరగాలి.
Baseline మరియు Endline ఇచ్చిన తేదీలలో టెస్ట్ ను కంప్లీట్ చేసి GP Pratham app లో నమోదు చేయవలసి వుంటుంది.
Baseline పెట్టిన పిల్లలకి మాత్రమే Endline పెట్టాలి.
కృత్యాలకు అనుగుణంగా TaRL మెటీరియల్ ను కచ్చితంగా ఉపయోగించి పిల్లలకు బోధించాలి. ఉదాహరణకు: కత్తిరించడం.
సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవడం... వంటివి.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍