Type Here to Get Search Results !

బోధనలో నైపుణ్యం తప్పనిసరి అభ్యర్థులకు డెమో నిర్వహిస్తున్న దేవానందరెడ్డి

🔳బోధనలో నైపుణ్యం తప్పనిసరి
Published: Wed, 14 Sep 2022 00:53:27 

బోధనలో నైపుణ్యం తప్పనిసరి అభ్యర్థులకు డెమో నిర్వహిస్తున్న దేవానందరెడ్డి


రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి సూచన 

Powered By
VDO.AI
PlayUnmute
Fullscreen

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 13: బోధనలో నైపుణ్యతా ప్రమాణాలు కచ్చితంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి స్పష్టం చేశారు. మోడల్‌ స్కూల్‌లో కాంట్రాక్టు పద్ధతిపై పీజీటీ అభ్యర్థుల తాత్కాలిక నియామక ప్రక్రియలో భాగంగా మంగళవారం చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యర్థులకు డెమో తరగతులు నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనరు తరపున పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి పరిశీలనాధికారిగా వచ్చారు. కమ్యూనికేట్‌ సబ్జెక్టు, రెస్పాన్సిబులిటీ ఆఫ్‌ స్టూడెంట్‌ అంశాలపై డెమో చేపట్టారు. మెరిట్‌లిస్టు ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలిపించారు. మొత్తం 84 మంది పీజీటీ మ్యాథమెటిక్స్‌, బయాలజీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన విషయం తెలిసిందే. వాటికి గైర్హాజరైన స్థానంలో ఇతర అభ్యర్థులను డెమోకు పిలిపించి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియకు సంబంధించి పీజీటీ మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులో 64 మంది, పీజీటీ బయాలజీ అభ్యర్థులు 20 మందిని డెమోకు పిలిచారు. తొలిరోజు 60 శాతం మంది డెమో పూర్తి చేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ దేవానందరెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు బోధనపరంగా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. విద్యార్థులను బాధ్యతగల వారిగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉండాలన్నారు. ఈ ప్రక్రియకు జేసీ వెంకటేశ్వర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. డెమో ప్రక్రియలో డీఈవో పురుషోత్తం, సబ్జెక్టు విషయ నిపుణులు, హెచ్‌ఎంలు పాల్గొనగా, అభ్యర్థులు తరగతి గదుల్లోని విద్యార్థులకు వివిధ అంశాలపై బోధించారు. 
టెన్త్‌లో 11 పేపర్లు అమలు చేయండి 
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఏడుకు బదులు పాత విధానంలో 11 పేపర్లు అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వినాయకం ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన్ను నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని కోరారు.
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...