* స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ హెచ్‌హెచ్‌సీఎం (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ కామర్స్ విభాగ డీన్ ఆచార్య ఆనంద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేకపోయిన వారికి 11వ తేదీ ఉదయం 9 గంటల వరకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని పత్రాల జిరాక్స్ కాపీలతో సంప్రదించాలని సూచించారు. జనరల్, బీసీ విభాగానికి చెందిన వారు ఆలస్య, రిజిస్ట్రేషన్ రుసుం కలిపి రూ.1700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1300 డిమాండ్ డ్రాఫ్ట్‌తో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి రావాలని వివరించారు. వీటితోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టుసైజు ఫొటోలు తీసుకురావాలని తెలిపారు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍