Type Here to Get Search Results !

hindi diwas: హిందీ దివస్‌.. సంగతులు భేష్‌!

hindi diwas: హిందీ దివస్‌.. సంగతులు భేష్‌!

hindi diwas: హిందీ దివస్‌.. సంగతులు భేష్‌!

దేశంలో అత్యధికుల నోళ్లలో నానే మాట... భిన్న సంస్కృతుల వారధి... కేంద్ర అధికారిక హోదా అందుకున్న భాష... హిందీ భాష. నేడు హిందీ దివస్‌.. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు.

* 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని జాతీయ అధికారిక భాషగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 14ని ‘హిందీ దివస్‌’గా జరుపుకొంటున్నారు.

* పర్షియన్‌ పదం ‘హింద్‌’ నుంచి హిందీ పుట్టుకొచ్చింది. ఇండస్‌ నదీ పారుతున్న నేలలో మాట్లాడే భాష అని దీని అర్థం.

* కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు భాషల్లో హిందీ ఒకటి. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ.

* ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో నాలుగోస్థానంలో ఉంది. మాండరియన్‌, స్పానిష్‌, ఇంగ్లిష్‌, తర్వాత హిందీనే ఎక్కువగా 35 కోట్ల మంది మాట్లాడుతున్నారు.

* భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, యూఏఈ, ఉగాండా, గయానా, సురినామ్‌, ట్రినిడాడ్‌, మారిషస్‌, దక్షిణాఫ్రికాల్లోనూ హిందీని జనం గణనీయ సంఖ్యలో మాట్లాడతారు.

* కాకా కాలేల్కర్‌, మైథిలీ శరణ్‌ గుప్తా, హజారీ ప్రసాద్‌ ద్వివేదీ, సేథ్‌ గోవింద్‌దాస్‌ హిందీ అధికారిక భాషగా గుర్తింపు పొందడంతో విశేష కృషి చేశారు.

* ప్రపంచ భాష ఇంగ్లిష్‌.. హిందీ నుంచి చాలా పదాలు అరువు తీసుకుందంటే మీరు నమ్ముతారా? అవతార్‌, బంగ్లా, గురు, కర్మ, లూట్‌, పంచ్‌, పైజామా, షాంపూ, యోగా.. ఇవన్నీ ఆంగ్లంలో విరివిగా వాడే హిందీ పదాలు.

* హిందీలో ప్రతి పదానికీ ప్రత్యేకమైన శబ్దం, ఆల్ఫాబెట్‌ ఉంటుంది. దీంతో ఆ పదాల్ని ఉచ్ఛరించడం, రాయడం తేలిక. ఇతర భాషలతో పోలిస్తే దీన్ని నేర్చుకోవడమూ సులభమే.

* దేశంలో హిందీని అధికారిక భాషగా గుర్తించిన మొదటి రాష్ట్రం బిహర్‌. 1881లో ఉర్దూ స్థానంలో హిందీని చేర్చారు.

* ప్రతి ఏడాది హిందీ దివస్‌ నాడు భారత రాష్ట్రపతి హిందీ భాష కోసం విశేష కృషి చేసిన కళాకారులు, రచయితలకు దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు

Tags
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...