IBPS Recruitment: 4135 PO and Management Trainee Vacancies - Download Admit Cards
ఐబీపీఎస్ రిక్రూట్ మెంట్: 4135 ప్రొబెషెనరీ ఆఫీసర్లు/మేనేజ్ మెంట్ ట్రెయినీల ఖాళీలు – అడ్మిట్ కార్డులు విడుదల
UPDATE 20-11-2021
ఐబీపీఎస్ పీఓ 2021 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ (అడ్మిట్ కార్డ్)ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో 100 మార్కులకు (100 ప్రశ్నలు) జరిగే ఈ ప్రిలిమినరీ పరీక్షను దేశవ్యాప్తంగా 2021 డిసెంబరు 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి.
==========================
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) 2022-23 సంవత్సరానికిగాను కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ పీఓ/ ఎంటీ XI) ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రొబెషెనరీ ఆఫీసర్లు/ మేనేజ్ మెంట్ ట్రెయినీలు:
మొత్తం ఖాళీలు: 4135
అర్హత: 10.11.2021 నాటికి ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.10.2021 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రిలిమినరీ పరీక్ష: దీన్ని మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాద్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెయిన్స్ కి ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్: దీన్ని మొత్తం 225 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకి వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 25 మార్కులకి ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే ) పరీక్ష ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2021, డిసెంబరు 04, 11.
మెయిన్ పరీక్ష: జనవరి 2022.
ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/ మార్చి 2022.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍