గమనికలు:
1. పరీక్షఫీజు కట్టుటకు అర్హతలు: “ (అ) 2021-22 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది, 31.08.2021 నాటికి యస్. యస్. సి. అభ్యర్థులు 14 సం||, ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 Sol వయస్సు నిండినవారు మాత్రమే పరీక్షఫీజు చెల్లించుటకు అర్హులు. (ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు. (ఇ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు
2. పరీక్ష రుసుమును ఎపి.టి.ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి/ చలానా రూపములో న్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.
3. ఎ.పి.టి.ఆన్ లైన్ వారు ఇచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును.
4. దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి.ఆన్ లైన్ నందు రిజిస్టేషన్ మరియు ఎ.పి.టి.ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.
5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక SB నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.
6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు.పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.
7.కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.
8. ఏదేని కారణముచే పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరితేదిని ప్రభుత్వమువారు సెలవుదినముగా ప్రకటించినచో, ఆ మరుసటి రోజు పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును.
9 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీరం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుమువాపసుఇవ్వబడదు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍