*📚✍️ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే✍️📚*
*♦️డీఏ బకాయిలపై తేల్చని క్యాబినెట్*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మరియు డీఏ బకాయిలు చెల్లింపులపై శుక్రవారం జరిగిన క్యాబినేట్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తోందని ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ తప్పలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ వైవీ రావు అన్నారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబం ధించి జనవరి నెల డీఏ, డీఏ బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. 1-7-2018 డీప్ ఎరియర్స్ నేటి వరకు చెల్లించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులకు క్యాష్ చెల్లింపులు జరగాల్సి ఉందన్నారు. ఓపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు జీపీఎఫ్ జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడం విచారకర మన్నారు. 1-7-2019 ఏ ఎరియర్స్ చెల్లించాలని జీవో ఇచ్చిన ప్రభుత్వం వెంటనే రద్దు చేయడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍