*వారికి లేని పెన్షన్ నాకెందుకు..?: వరుణ్ గాంధీ*
Jun 24,2022 16:51
న్యూఢిల్లీ : అగ్నివీరులకు పెన్షన్ పొందే అవకాశం లేనపుడు .. తనకు అవసరంలేదని బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. అగ్నిపథ్ ఈ పథకంలో అగ్నివీరుల పెన్షన్‌కు సంబంధించి నిబంధనలు ఎందుకు లేవని సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్వల్పకాలమైనా దేశానికి సేవ చేసే అగ్నివీరులకు పెన్షన్ పొందే అవకాశం లేదు.. అటువంటప్పుడు ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ పెన్షన్ పొందే సదుపాయం ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. అగ్నివీరులకు పెన్షన్ వచ్చేలా చేసేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపిలు పెన్షన్‌లను వదులుకోలేమా అని ప్రశ్నించారు. లోక్‌సభ అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. పార్లమెంట్‌లో సభ్యునిగా కొనసాగిన ప్రతి వ్యక్తికి నెలకు రూ. 20వేల పెన్షన్‌పొందేందుకు అర్హులు. ఏ వ్యక్తి అయినా పార్లమెంటుకు ఐదేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేసిన పక్షంలో అతను/ఆమె ఐదేళ్లకు మించి ప్రతి ఏడాది నెలకు రూ. 1500 చొప్పున అదనపు పెన్షన్ పొందుతారు. అయితే అగ్నివీరులకు ప్రారంభ జీతం రూ. 20వేలు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత కేవలం రూ. 12 లక్షలు మాత్రమే పొందుతారని అన్నారు. అగ్నివీరులకు పెన్షన్ లేనపుడు తనకు కూడా అవసరం లేదని అన్నారు. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు సంవత్సరాల సేవలను మాత్రమే వినియోగించుకుని.. ఆ తర్వాత కనీసం 75 శాతం రిక్రూట్‌లు లేదా పెన్షన్ ప్రయోజనాలు లేకుండా వారిని తొలగించడాన్ని ప్రతిపక్షాలు సహా పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍