Type Here to Get Search Results !

APPSC GROUP 2 MODIFIED NEW SYLLABUS, PATTERN OF EXAM


ఏపీలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 


ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నలుమార్కులు
భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర)3030
భూగోళశాస్త్రం (జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ)3030
భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం)3030
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు)3030
మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ)3030
మొత్తం150150


మెయిన్స్‌ పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నలుసమయం (నిమిషాల్లో)మార్కులు
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం)150150150
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)150150150
మొత్తం300 300


 


  పూర్తి సిలబస్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి  

Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...