*📚✍️గ్రూపు-1 మార్కులు ప్రకటించకపోవడంపై సందేహాలు📚✍️*
*♦️విమర్శలకు తావిస్తున్న ఏపీపీఎస్సీ*
*🌻ఈనాడు, అమరావతి*: గ్రూపు-1 (2018) వ్యవ హారంలో ఏపీపీఎస్సీ వైఖరి తీవ్ర విమర్శలకు తావి స్తోంది. మౌఖిక పరీక్షల ఫలితాలను వెల్లడించి 3 వారాలు దాటినా ఇప్పటికీ మార్కుల జాబితాను బహిర్గతం చేయలేదు. ఫలితాలు వెల్లడినాడే ఈ జాబితానూ ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపినా ఇప్పటికీ మార్కులను విడుదల చేయకపోవడం పై అభ్యర్థుల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబుపత్రా లను సంప్రదాయ విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారని, పలు జవాబు పత్రాల్లో. రెండు రకాల చేతిరాతలు ఉన్నాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన 'రిజాయిండర్' పేర్కొన్నారు. వాస్తవానికి ఎంపి కైన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజే... మార్కులనూ బహిర్గతం చేయాలి. పరీక్షల మూల్యాంకన తీరు, మౌఖిక పరీక్షల సరళి తెలుసు కునేందుకు మాధ్యమాల వారీగా (లాంగ్వేజస్) ఎంపికైన వారి జాబితా ప్రకటించాలని తొలినుంచీ అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. ఈ జాబి తానూ ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. సమాచార హక్కు చట్టం కింద అర్హత సాధించిన వారి జాబితా కోరినప్పటికీ ఇంకా నియామకాల ప్రక్రియ సాగుతున్నందున ఇవ్వలేమని సమా ధానం ఇచ్చిందని అభ్యర్థులు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍