Type Here to Get Search Results !

కలాం మీకు మా సలాం...!!! భారత రత్న అబ్దుల్ కలాం వర్దంతి సందర్భంగా...

*🙏కలాం మీకు మా సలాం...!!!*

*భారత రత్న అబ్దుల్ కలాం వర్దంతి సందర్భంగా...*

*కలలు* కనండి... 
వాటిని *సాకారం* చేసుకోండి...
అంటూ చెప్పడమే కాదు...తాను కూడా *ఆచరించి...* జీవితాన్ని *చరితార్థం* చేసుకున్న *మహనీయుడాయన.*
ఎంత ఎత్తుకు *ఎదిగినా...* 
*ఒదిగే* ఉండాలన్న సందేశాన్ని 
*చేతల్లో* చూపిస్తూ...
*ప్రపంచ వ్యాప్తంగా* గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి ఆయనే.
భారత దేశాన్ని *మిస్సైల్ పవర్‌గా* మార్చిన గొప్ప వ్యక్తి *ఏపీజే అబ్దుల్ కలాం.* 

దేశంలోనే పెరిగి... చదువుకుని.. *పరిశోధనలు చేసి...* ఆఖరికి ఇండియాకే పాఠాలు చెప్పి... భారతావని *బ్రాండ్ అంబాసిడర్* లా మారిన ఒకే ఒక్కడు *అబ్దుల్ కలాం.* 

*నేర్చుకోవడం* కలాం హాబీ. 
*చదవడం* ఆయన ప్యాషన్. తెలుసుకున్న ప్రతి విషయాన్ని... నలుగురితో *పంచుకోవడం* ఇష్టం. ఇదే తపనతో ప్రపంచాన్ని చదివి…సమాజాన్ని స్కాన్ చేసి...మేధావి అనిపించుకున్నారు *కలాం...* 

యంగ్ ఏజ్ లోనే *ఫిజిక్స్* ను వడబోసి... తర్వాత ఏరో స్పేస్ లో ఇంజినీరింగ్ పూర్తిచేసి *విజ్ఞానశాస్త్రంలో* వరుస పరిశోధనలు చేశారు. శాస్త్రాన్నే కొత్త స్టాండర్డ్స్ కు తీసుకెళ్లారు. యుద్ధ *పైలట్* కావాలన్న ఆశతో పరీక్ష రాసి ఫెయిలైన *అబ్దుల్ కలాం…* ఆ తర్వాత దేశాన్ని తన మార్గంలో నడిపి అసలైన పైలట్ అనిపించుకున్నారు. 

ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు ఎన్నో సాధించిన కలాం కెరీర్… *డిఫెన్స్*  తో మొదలైంది. *రక్షణ*
రంగానికి అవసరమైన తేలికపాటి హెలికాప్టర్ తయారీ ప్రాజెక్ట్ లో *కలాంకు* మొదట ఛాన్స్ వచ్చింది. ఆ పోస్ట్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయిన కలాం… *ఇస్రో* వైపు అడుగులు వేశారు. అక్కడే ఆయన *రాకెట్ మేకర్*  అయ్యారు. 

అగ్ని, పృధ్వీ సహా అనేక మిస్సైల్స్ ఆయన డైరెక్షన్ లోనే నింగిలోకి దూసుకెళ్లాయి. శాస్త్రవేత్తగా, *రాష్ట్రపతిగా* ఎన్నో స్ఫూర్తిరగిలించే ఉపన్యాసాలు ఇచ్చిన కలాం... చివరకు 2015, జులై 27న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 

కలాం రాసిన పుస్తకాలను చదివి చాలా మంది ఆయనను *ఆదర్శంగా* 
తీసుకున్నారు. ఆ మహానుభావుడి వర్థంతి సందర్భంగా ఆయనకు  *నివాళులు* అర్పిద్దాం...!!!
Tags
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...