*ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే కుదరదు*
*హేతుబద్దీకరణలో సవరణలు చేయలేదని ఏ సంఘ నాయకుడైనా చెబితే తలదించుకుంటాను*
*మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు*
*ఈనాడు, అమరావతి:* "ఉపాధ్యాయులకు ఇచ్చిన 8 గంటలు వారు ఎందుకు పనిచేయరు? ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల మనసులో ఏం ఆలోచన ఉందో నాకేం తెలుసు టీచర్లకు ఉద్యోగరీత్యా ఇబ్బంది వస్తే సరి చేస్తాం. అంతేగానీ పాఠశాలల విలీన విధానమే తప్పంటే ఎలా? ఇంకో విధానం చెప్పాలి' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొ న్నారు. విజయవాడలో మంగళవారం ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'పాఠశాలల విలీనంపై కమ్యూనిస్టు ఎమ్మెల్సీలే బస్సు యాత్ర చేస్తున్నారు.. మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు చేయబ్లేదు. ప్రభుత్వాన్ని బెదిరిమంటే కుదరదు.. ఎక్కడ బెదిరించాలో.. ఎక్కడ తగ్గాలో చూడాలి. 100శాతం ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకునే విలీనం, హేతుబద్ధీకరణ చేస్తున్నాం. ఉపాధ్యాయులు అడిగితే హేతుబద్ధీకరణ జీవో-117ను సవరించి జీవో 128 ఇచ్చాం. ఉపాధ్యాయులు చెప్పిన దాంట్లో సమంజసంగా ఉన్నవాటినే చూస్తాం, విలీన విధానం వద్దంటే ఎలా? ఇంకో విధానం చెప్పమనండి? ప్రతి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలని నేనే చెప్పాను. ఏ సంఘ నాయకుడినైనా తీసుకువచ్చి వారు చెప్పిన సవరణలు చేయలేదని. చెప్పించండి.. నేను తల దించుకుంటాను. పాఠశాలల
విలీనాన్ని తల్లితండ్రులు అందరూ అంగీకరిస్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినచోట.. రహదారులు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వచ్చినచోట అభ్యంతరం తెలుపుతున్నారు. అలాంటిచోట మారుస్తాం. విలీనంపై అభ్యంతరాల స్వీకరణకు నేనే ఎమ్మెల్యేలకు లేఖలు రాశాను. తెదేపా ఎమ్మెల్యేల నుంచి లేఖలు వచ్చాయి. వాటిని పరిశీలిస్తాం. 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 400 పాఠశాలలపై అభ్యంతరాలు వచ్చాయి. అంటే మిగతావి బాగున్నట్టే కదా? ఆభ్యంతరాలపై జేసీల ఆధ్వర్యంలో కమిటీలు వేశాం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. పాఠశాలల భవనాలు పడిపోయి ఉన్నాయంటే దానికి కారణం గతంలో సీఎంగా చేసిన చంద్రబాబే. మూడో తరగతి వారికి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన వద్దని చంద్రబాబు చెబుతారేమో చెప్పమనండి. మీడి యాను అభ్యర్ధిస్తున్నా. వ్యవస్థను బాగు చేయడానికి ప్రయత్నించండి. చిన్నాభిన్నం చేయొద్దు. తప్పుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం' అని మంత్రి పేర్కొన్నారు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍