*టెట్ నోటిఫికేషన్‌లోనే*
*అన్నీ చెప్పేశాం: విద్యాశాఖ✍️📚*
*🌻అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి)*: టెట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి గందరగోళం లేదని, సమాచారం విషయంలో ఎక్కడా గోప్యత పాటించడం లేదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏర్పడిన గందరగోళంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై శాఖ స్పందించింది. ఒకే రోజు రెండు రకాల పరీక్షలు నిర్వహించడం లేదని, ఇప్పటికీ విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని వివరించింది. పరీక్షల సమయం, ఇతర వివరాలన్నీ టెట్ నోటిఫికేషన్‌లోనే చెప్పేశామని సమర్థించుకుంది. కాగా మంగళవారం కూడా తెనాలికి చెందిన ఓ మహిళా అభ్యర్థి పరీక్షా కేంద్రం కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించగా చెన్నైలో మాత్రమే ఉన్నట్లు చూపించింది. ఎందుకీ పరిస్థితి వచ్చిందనేది చెప్పకుండా, అంతా సజావుగా సాగుతోందని విద్యాశాఖ చెప్పుకొస్తోంది.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍